తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి కి( Megastar Chiranjeevi ) ‘అందరివాడు’ అనే పేరు ఉండేది.ఎందుకంటే ఆయన తన తోటి స్టార్ హీరోలతో పాటుగా, చిన్న ఆర్టిస్టులతో కలుపుకొని ప్రతీ ఒక్కరితో ఎంతో స్నేహం గా, ఆప్యాయంగా ఉంటారు.
అందుకే ఆయనని అలా పిలుస్తారు.ఇక ఆయన వారసత్వం ని వణికిపుచ్చుకున్న రామ్ చరణ్ కి( Ram Charan ) మాత్రం తండ్రి సుగుణాలు రాకుండా ఎలా ఉంటుంది.
ఆయన కూడా తన తండ్రిలాగానే తన తోటి హీరోలతో ఎంతో సన్నిహితం గా ఉంటాడు.బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ( Pawan Kalyan ) తనకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
చిన్నతనం మొత్తం బాబాయ్ పెంపకం లోనే సాగింది, అలా ఆయనతో ఎంతో మంచి అనుబంధం ఉంది.ఇక అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తో కూడా రామ్ చరణ్ ఎంతో సన్నిహితం గా ఉంటాడు.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద తనతో నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీని ఇచ్చే ఎన్టీఆర్ , మహేష్ బాబు మరియు ప్రభాస్ కూడా రామ్ చరణ్ కి ఎంతో మంచి స్నేహితులు.
‘అన్ స్టాపబుల్’ షోలో ఒకసారి పవన్ కళ్యాణ్ కోసం , మరొకసారి ప్రభాస్ కోసం ఫోన్ చేసినప్పుడు రామ్ చరణ్ తో ఎంతో చనువుగా మాట్లాడడం గమనించిన ఫ్యాన్స్ ,వీళ్లిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు.అలాగే ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు విచ్చేసిన రామ్ చరణ్ ని బాలయ్య బాబు( Balakrishna ) ఎంతో గౌరవించాడు.
ఆయనని స్వయంగా తీసుకెళ్లి చంద్ర బాబు నాయుడు పక్కన కూర్చోబెట్టాడు.
ఈ అరుదైన సంఘటన చూసి , ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య ఉన్న అనుబంధం ని చూసి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.